SPECIAL OPINION DAILY ENGLISH NEWS PORTAL

AP Governor appeals youth to donate blood & save lives..

Vijayawada(Special Opinion)On the occasion of World Blood Donor Day on June 14, Andhra Pradesh Governor Sri Biswa Bhusan Harichandan appealed to the youth and students to come forward in large numbers to donate blood and save lives. The Governor said no life should be lost in the State for want of blood.World Blood Donor Day is celebrated on June 14, every year to commemorate the birth anniversary of Karl Landsteiner, an Austrian biologist, physician and immunologist, who distinguished the main blood groups in 1900. For this discovery, Karl Landsteiner received the Nobel Prize in Medicine, in the year 1930.The World Blood Donor Day event, established in 2004, serves to raise awareness of the need for safe blood and blood products, and to thank blood donors for their voluntary, life-saving gifts of blood. The theme of this year’s World Blood Donor Day is “Safe Blood Saves Life”.The Governor said voluntary non-remunerated blood donation is critical for high-quality blood service and a system of regular and voluntary non-remunerated blood donation is critical for high-quality blood service delivery. Promoting equity, access, quality and safety of blood and blood components is indispensable to achieve the Millennium Development Goals, said the Governor.Governor Sri Harichandan said blood collection during the current year is severely affected due to crippling effect of COVID-19 and the subsequent restrictions imposed on organising Blood Donation Camps during the four phases of the lockdown period from 25th April to 31st May. However, all the 18 Indian Red Cross Society Blood Banks in the State have reached out to the Blood Donors and collected about 6000 units during the lockdown period and made available to the thalassemia and sickle cell anemia patients, free of cost, as they need blood transfusion therapy on regular basis.“I deeply appreciate and thank all those voluntary Blood Donors who have donated blood during the crisis created by COVID -19 pandemic, during the lockdown period and I appeal and urge upon all the students and youth in the State to come forward in large numbers and register themselves as Blood Donors and participate in the ‘Donate Blood – Save a Life’ Campaign”, said the Governor.The AP State Branch of the Indian Red Cross Society, has made arrangements to collect at least 10,000 units of blood in every Red Cross Blood Bank in the State.

రక్తదానం చేసి ప్రాణాలను కాపాడండి
యువతకు రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజ్ఞప్తి

విజయవాడ, జూన్ 13: అన్ని దానాలలో కెల్లా అత్యంత విలువైన రక్తదానంతో ప్రాణాలను నిలబెట్టవచ్చని, నేటి యువత క్రమం తప్పకుండా రక్తదానాన్ని ఆచరించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. జూన్ 14 న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ రక్తదాత దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా, రక్తం దానం చేసి ప్రాణాలను కాపాడటానికి యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విజ్ఞప్తి చేశారు. రక్త నిల్వలు లేని కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని గవర్నర్ అభిలషించారు. ప్రధాన రక్త సమూహాలను వేరు చేసిన ఆస్ట్రియన్ జీవశాస్త్రవేత్త, వైద్యుడు, రోగనిరోధక శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్‌స్టైనర్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 14 న ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1900 లో రక్తకణాల విభజనకు సంబంధించిన ఆవిష్కరణను కార్ల్ ల్యాండ్‌స్టైనర్ పూర్తి చేయగా, 1930 సంవత్సరంలో ఆయన నోబెల్ బహుమతిని అందుకున్నారు. 2004 లో స్థాపించబడిన ప్రపంచ రక్తదాత దినోత్సవం సురక్షితమైన రక్తం, రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన పెంచుతోంది. ఈ సంవత్సరం ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని “సురక్షితమైన రక్తం జీవితాన్ని ఆదా చేస్తుంది” అన్న నినాదంతో నిర్వహిస్తున్నారని గవర్నర్ ఈ నేపధ్యంలో వివరించారు. అధిక, నాణ్యమైన రక్త నిల్వల సరఫరాకు పారితోషికం ఆశించని స్వచ్ఛంద రక్తదాన విధానం చాలా ముఖ్యమైనదని గవర్నర్ అన్నారు. రక్తంతో పాటు రక్త భాగాల నాణ్యత, భద్రతను ప్రోత్సహించడం అనేది మిలీనియం అభివృద్ధి లక్ష్యాల సాధనలో కీలకమైందని బిశ్వభూషణ్ పేర్కోన్నారు. కరోనా ప్రభావంతో నెలకొన్న లాక్ డౌన్ పరిస్ధితులు రక్తదాన శిబిరాల నిర్వహణకు ఆటంకంగా మారాయని, అది ప్రస్తుత సంవత్సరంలో రక్త సేకరణపై తీవ్రంగా ప్రభావితం చూపిందని గవర్నర్ శ్రీ హరిచందన్ అన్నారు. ఈ విపత్కర కాలంలో కూడా రాష్ట్రంలోని 18 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులు రక్తదాతలను చేరుకుని, సుమారు 6000 యూనిట్లను సేకరించి రోగుల అవసరాలకు అనుగుణంగా ఉచితంగా రక్తాన్ని అందుబాటులో ఉంచగలగటం అభినందనీయమన్నారు. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభ సమయంలో రక్తదానం చేసిన స్వచ్ఛంద రక్తదాతలందరినీ తాను అభినందిస్తున్నానని గవర్నర్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎపి స్టేట్ బ్రాంచ్ రాష్ట్రంలోని ప్రతి రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో కనీసం 10,000 యూనిట్ల రక్తాన్ని సేకరించే ఏర్పాట్లతో సిద్దంగా ఉందని యువత కదిలి రావాలని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి తమను తాము రక్తదాతలుగా నమోదు చేయించుకుని ‘రక్తదానం-జీవితాన్ని రక్షించు’ ప్రచారంలో భాగస్వాములు కావాలని గౌరవ గవర్నర్ పిలుపు నిచ్చారు.

జారీ చేసిన వారు: గవర్నర్ కార్యదర్శి వారి కార్యాలయం, రాజ్ భవన్ , విజయవాడ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »