SPECIAL OPINION DAILY ENGLISH NEWS PORTAL

AP Governor pays homage to Col. Santosh Babu…

Vijayawada, June 16: Andhra Pradesh Governor Sri Biswa Bhusan Harichandan paid homage to Colonel B. Santosh Babu, Commanding Officer of the 16 Bihar Regiment and the two soldiers who made their supreme sacrifice today at Galwan Valley, in Ladakh along the LAC.The Governor in a message said he “salutes the brave hearts for the ultimate sacrifice made by the Officer and the two soldiers, who attained the martyrdom in the service of the Nation. The Governor offered his “deepest condolences to members of the families of the martyrs and offered his prayers for bestowing peace on them.”

కల్నల్‌ సంతోష్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపిన బిశ్వ భూషణ్

విజయవాడ: భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు సైనికులు మృతి చెందడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీర మరణం పొందిన వారిలో తెలుగు వారైన తెలంగాణా, సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌ ఉండగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు సంతోష్‌ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు. లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్‌, చైనాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం వల్ల ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంతోష్‌ ఆంధ్ర ప్రదేశ్ లోని సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. సంతోష్‌ మరణవార్త తనను ఎంతో కలిచి వేసిందన్న గవర్నర్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. భారత దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించే ప్రయత్నంలో అమరులైన జవాన్ల సేవలు వృధా పోవని బిస్వ భూషణ్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.కల్నల్‌ సంతోష్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపిన బిశ్వ భూషణ్ భారత్‌-చైనా ఘర్షణలో ముగ్గురు సైనికులు మృతి చెందడం పట్ల ఎపి గవర్నర్ తీవ్ర ఆందోళన సంతోష్‌ మరణవార్త తనను ఎంతో కలిచి వేసిందన్న గవర్నర్ వీర మరణం పొందిన సైనికుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపిన హరి చందన్ దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించే ప్రయత్నంలో అమరులైన జవాన్ల సేవలు వృధా పోవన్న బిశ్వ భూషణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »