SPECIAL OPINION DAILY ENGLISH NEWS PORTAL

Governor to address joint session of AP Legislature through video conference..

Secretary to Governor reviews VC arrangements

Vijayawada, June 15: As the Governor Sri Biswa Bhusan Harichandan is going to address the joint session of the AP Legislature through video conference from Raj Bhavan on Tuesday, Sri Mukesh Kumar Meena, Secretary to Governor, reviewed the preparatory arrangements made at the Durbar Hall of Raj Bhavan, on Monday. Governor Sri Harichandan has taken the unique decision to address the joint session of the AP Legislature through video conference, which is a first in the country, in view of the situation posed by the COVID-19 pandemic and the need to maintain social distance. It is customary that the Governor attends the Legislature premises personally and addresses the joint session of the Legislature where members of both Assembly and Council are present. However, Governor has taken the decision to address the joint session through video conference in deference to the laid down medical protocols to maintain social distance, under the present circumstances. Sri Mukesh Kumar Meena, Secretary to Governor, Sri TVK Reddy, Commissioner, I&PR, reviewed the technical arrangements made for Governor’s address through video conference on Tuesday, along with officials of IT department, I&PR department and Legislature dept, who are jointly coordinating the arrangements. Directions were given to officials to ensure that uninterrupted power supply is maintained during the video conference. Live trial of the video conference system was conducted by interacting with the officials of AP Legislature. To ensure maintenance of social distance, this time members of the Assembly and the Council will be seated separately in their respective Houses. Arrangements have been made to display Governor’s address to the joint session on large LED screens specially set up in both the Houses for this purpose.

శాసన మండలి సమావేశాల నేపధ్యంలో నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఆన్ లైన్ ప్రసంగం

సాంకేతిక అంశాలపై సమీక్ష నిర్వహించిన ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆన్ లైన్ లో రాజ్ భవన్ నుండి ప్రసంగించనుండగా ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాష్ట్ర ప్రధమ పౌరుడు ఆన్ లైన్ ప్రసంగం ద్వారా రాష్ట్ర శాసన మండలిని ఉద్దేశించి ప్రసంగించటం దేశ చరిత్రలోనే తొలిసారి. కరోనా వ్యాప్తి నేపధ్యంలో భౌతిక దూరం పాటించవలసి ఉండగా, గవర్నర్ హరిచందన్ ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా శాసన సభ బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో గవర్నర్ శాసన మండలికి స్వయంగా వచ్చి రాష్ట్ర శాసన సభ, శాసన పరిషత్తులలోని సభ్యులందరినీ ఉద్దేశించి ప్రసంగించటం అనవాయితీ. ప్రస్తుత విపత్కర పరిస్ధితుల కారణంగా గౌరవ గవర్నర్ వైద్యపరమైన ప్రోటోకాల్ ను పాటిస్తూ నూతన సాంప్రదాయానికి నాంది పలికారు. ఈ క్రమంలో సోమవారం రాజ్ భవన్ నుండి ఉన్నతాధికారులు ఆన్ లైన్ వ్యవస్ధకు సంబందించిన ముందస్తు రిహార్సల్ నిర్వహించారు. సాంకేతిక అంశాలపై గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఐటి, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం నాటి కార్యక్రమం లోప రహితంగా ఉండేలా చూడాలని విద్యుత్త్ పరమైన ఆటంకాలు లేకుండా సమన్వయం చేసుకోవాలని దిగువ స్దాయి అధికారులకు ఆదేశించారు.

రాజ్ భవన్ నుండి గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ విజయ కుమార్ రెడ్డి, ముఖ్య సమాచార ఇంజనీర్ మధుసూధన్ తదితరులు, అసెంబ్లీ ప్రాంగణం నుండి శాసన మండలి కార్యదర్శి బాల కృష్ణమాచార్యులు ఆన్ లైన్ విధానంలో ప్రత్యక్షంగా పాల్గొని వ్యవస్ధ పనితీరును సమీక్షించారు. రాష్ట్ర ఐటి శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ సంయిక్తంగా ఆన్ లైన్ వ్యవస్ధను పర్యవేక్షిస్తున్నాయి. శాసన సభలో శాసన సభ్యులు, శాసన పరిషత్తులో ఎంఎల్ సిలు వేరు వేరుగా కూర్చుని గవర్నర్ ప్రసంగాన్ని విననున్నారు. ఇందుకోసం అయా సభలలో ప్రత్యేకంగా గోడ తెరలను ఏర్పాటు చేసారు. పది గంటలకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభం కానుండగా, గౌరవ ప్రధమ పౌరుని ప్రసంగం తదుపరి జాతీయ గీతంతో ఆన్ లైన్ ప్రసంగం కార్యక్రమం ముగుస్తుంది.

జారీ చేసిన వారు: గవర్నర్ కార్యదర్శి వారి కార్యాలయం, రాజ్ భవన్ , విజయవాడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »